కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి: రెండు కప్పులు, వాము: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, తెల్లనువ్వులు: ఒక టేబుల్ స్పూన్, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యపు పిండి, వాము, ఉప్పు, నువ్వులు, వెన్న వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయాలి. పిండిముద్దను కొద్దికొద్దిగా తీసుకుని మురుకుల గొట్టంలో వేసి.. కాగిన నూనెలో ఒత్తుకుని దోరగా వేయించుకుంటే కరకరలాడే వెన్న మురుకులు సిద్ధం.