ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదా!? కరెంటు కోతలు, ప్రయాణాల్లో ఇట్టే చెమట పట్టేస్తున్నదా!? అయితే, మీ చేతిలో ఈ బుల్లి ‘హష్జెట్ మినీ కూల్ ఫ్యాన్’ ఉండాల్సిందే! ప్రఖ్యాత డైసన్ కంపెనీ తయారుచేసిన ఈ మినీ కూల్ ఫ్యాన్.. వేసవిలో మీకు చల్లని నేస్తం అవుతుంది.
ఈ వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించడానికి డైసన్ కంపెనీ ‘హష్జెట్ మినీ కూల్ఫ్యాన్’ను తయారుచేసింది. కేవలం 212 గ్రాముల బరువుండే ఈ మినీ ఫ్యాన్‌ను మెడలో వేలాడదీసుకోవచ్చు. ఇందులో 65,000 ఆర్పీఎం వరకూ తిరిగే బ్రష్‌లెస్ డీసీ మోటార్‌ను అమర్చారు. ఇది గంటకు 25 మీటర్ల వేగంతో గాలిని అందిస్తుంది. ఎయిర్ మల్టిఫ్లయర్ టెక్నాలజీ వల్ల చుట్టూ ఉన్న గాలిని లాగి.. మీకు మరింత శక్తిమంతమైన ఎయిర్ఫ్లోని అందిస్తుంది. ఇక ఇందులోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. దాదాపు ఆరు గంటలపాటు చల్లని గాలిని అందిస్తుంది. యూఎస్బీ-సి కేబుల్ ద్వారా.. కేవలం మూడు గంటల్లోనే బ్యాటరీ పూర్తిగా రీచార్జ్ అవుతుంది.
ఇందులో మొత్తం ఆరు స్పీడ్ కంట్రోల్స్ ఉండగా.. వాటిలో బూస్ట్ మోడ్ కూడా ఉంది. తీవ్రమైన వేడిలో ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం కోసం ఈ మోడ్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ అత్యాధునిక మినీ ఫ్యాన్ బ్లేడ్లెస్ డిజైన్‌తో వస్తున్నది. ఇందులో బయటికి కనిపించే రెక్కలు ఉండవు. కాబట్టి పిల్లలు కూడా సురక్షితంగా వాడుకోవచ్చు. నిజానికి డైసన్ ఫ్యాన్లు చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. ఈ మినీ ఫ్యాన్ కూడా వాటినే ఫాలో అవుతుంది. ఇది కేవలం 52 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే చేస్తుంది. పలు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్న ఈ మినీ ఫ్యాన్ ధర.. రూ.12,200. అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నది.