వేసవిలో ట్యాన్ సమస్య తప్పించుకోలేనిది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని నియంత్రించవచ్చు. సహజ ఫేస్ మాస్కులు చర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంట్లోనే తయారుచేసుకునే ఈ సింపుల్ మాస్కులు మన అందాన్ని కాపాడుతూ, ఆరోగ్యకరమైన గ్లోను అందిస్తాయి.
బంగాళాదుంపలో ఉండే సహజ ఎంజైమ్‌లు చర్మంపై ఉన్న ట్యాన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మరసం చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
బంగాళాదుంప రసం: 2 చెంచాలు
నిమ్మరసం: 1 చెంచా
తేనె: అర చెంచా
అన్ని పదార్థాలను బాగా కలిపి మృదువైన మిశ్రమంగా చేసుకోవాలి. ముఖం, మెడపై రాసి 15 నిమిషాలు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. ట్యాన్ డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. స్కిన్ టోన్ సమంగా కనిపిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
టమాటాలో ఉండే లైకోపీన్ చర్మాన్ని సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా చేసి ట్యాన్‌ను తగ్గిస్తుంది.
టమాటా గుజ్జు: 2 చెంచాలు
పెరుగు: 1 చెంచా
బియ్యపు పిండి: 1 చెంచా
మూడింటినీ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ముఖానికి ఐప్లె చేసి 20 నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేస్తూ కడగాలి. దీంతో డెడ్స్కిన్ తొలగి క్రమంగా ట్యాన్ తగ్గిపోతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది.
ఇది హీలింగ్ మాస్క్. ఎండ వల్ల కమిలిన చర్మానికి స్వాంతన కలిగించడానికి ఇది సాయపడుతుంది. కలబంద చర్మానికి తేమను అందిస్తే, పసుపు చర్మం నల్లబడటాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తుంది.
కలబంద జెల్: 2 చెంచాలు
పసుపు: చిటికెడు
రోజ్‌వాటర్: 1 చెంచా
అన్ని పదార్థాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారు చేయాలి. ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల సన్‌బర్న్ (మంట, ఎర్రదనం) తగ్గుతుంది. చర్మానికి తేమ లభిస్తుంది. ట్యాన్ తగ్గి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.