పురుగుమందు అరికట్టేసి
‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్'కి మూడు మిలియన్ల మంది యంగ్ సైంటిస్టులు పోటీపడుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యామ్నాయం చూపే ఆవిష్కరణలకు 25 వేల డాలర్ల గ్రాంట్‌ని ఇస్తారు. ఈ పోటీలో ఫైనల్ రౌండ్ జాబితాకు ఎంపికైన యువ సైంటిస్టుల్లో భారతీయ మూలాలున్న అరికా కుందు ఉంది. మిన్నెసొటాలో నివసిస్తున్న అరిక ఏడో తరగతి చదువుతున్నది. కూరగాయలు, పండ్లపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించేందుకు ఆమె ఓ ఉపాయం కనుగొంది. ప్రకృతిలో కొన్ని పదార్థాలకు సహజంగానే రసాయనాలను పీల్చుకునే స్వభావం ఉంది.
‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్’కి మూడు మిలియన్ల మంది యంగ్ సైంటిస్టులు పోటీపడుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యామ్నాయం చూపే ఆవిష్కరణలకు 25 వేల డాలర్ల గ్రాంట్‌ని ఇస్తారు. ఈ పోటీలో ఫైనల్ రౌండ్ జాబితాకు ఎంపికైన యువ సైంటిస్టుల్లో భారతీయ మూలాలున్న అరికా కుందు ఉంది. మిన్నెసొటాలో నివసిస్తున్న అరిక ఏడో తరగతి చదువుతున్నది. కూరగాయలు, పండ్లపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించేందుకు ఆమె ఓ ఉపాయం కనుగొంది. ప్రకృతిలో కొన్ని పదార్థాలకు సహజంగానే రసాయనాలను పీల్చుకునే స్వభావం ఉంది.
అలాంటి గుణం కలిగిన పల్లిపొట్టుని ఉపయోగించి పురుగుమందుల అవశేషాలను శోషణ చేసేందుకు ఇంట్లోనే ప్రయోగాలు చేపట్టింది. ఓ గదిలో చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని పల్లీపొట్టును పొడి చేసింది. ఈ పొడి కొన్ని రసాయనాలను శోషించుకుంటుందని ప్రయోగ పూర్వకంగా నిరూపించింది. పల్లీపొట్టు పొడిలోని అణువులు పెస్టిసైడ్ అణువులను బంధిస్తాయి. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తాజా ఉత్పత్తులపై ఉండే పెస్టిసైడ్స్ అవశేషాలను జీవశోషణ ద్వారా తొలగించడం కోసం ఆమె చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కి ‘లిగ్నెక్స్’ అని పేరు పెట్టింది. ఒకవేళ అమెరికా యంగ్ సైంటిస్ట్ కాంపిటేషన్‌లో టాప్‌గా నిలిస్తే తన ప్రయోగాన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగైన పరిష్కారం చూపుతానని చెబుతున్నది అరిక.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

