హైదరాబాద్లో ట్రాఫిక్ రోజురోజుకూ నరకాన్ని తలపిస్తున్నది. శుక్రవారం రాఖీ పండుగ వేళ.. రద్దీ మరింత పెరిగిపోవడంతో వాహనదారుల బాధలు రెట్టింపయ్యాయి. నగర ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో ఒకదానిని ఆనుకొని మరొకటి మెల్లగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా నారపల్లి-ఉప్పల్ ప్రాంతంలోప్రయాణికులు చుక్కలు చూశారు. ఇంతలా ప్రజలు కష్టాల ‘దారి’లో ప్రయాణించినా..వాహనాలను క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు మాత్రం కాసుల వేటలో బిజీబిజీగా గడిపారు. ట్రాఫిక్ నియంత్రణ కంటే చలాన్ల వసూళ్లకే పరిమితమయ్యారు. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.