పిల్లల్లో తరచుగా కనిపించే సమస్య.. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం. శరీరరోగ నిరోధక వ్యవస్థలో కీలకంగా ఉండే ఈ కణాలు తగ్గితే.. రోగాల దాడిని అడ్డుకోవడం కష్టం. దీంతో పిల్లల్లో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సమస్యలతోపాటు పలు వ్యాధులు కూడా దాడిచేయవచ్చు. సోల్జర్స్ ఆఫ్ ద బాడీగా పేరున్న తెల్లరక్త కణాల బలం పెంచుకుంటే రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. కొన్నిరకాల ఆహార పదార్థాలను రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుకోవచ్చు.