అందమైన గోళ్లంటే.. ఆడవాళ్లందరికీ ఇష్టమే! ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా.. నిత్యం మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకోవాల్సిందే! వేసుకోవడం వరకు ఓకే కానీ.. నెయిల్ పాలిష్‌ను తొలగించడమే కష్టం! అందులోనూ ప్రతిసారీ నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించడం ఎంతో ప్రమాదకరం! రిమూవర్లోని రసాయనాల వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. పెళుసుగా మారి విరిగిపోతాయి. కాబట్టి, రిమూవర్కు బదులుగా.. ఇంటి చిట్కాలతోనే ఈజీగా నెయిల్ పాలిష్‌ను పోగొట్టుకోవచ్చు.
గోరువెచ్చని నీటిలో ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండాలి. దానిలో సోప్ లిక్విడ్ కలపాలి. ఇప్పుడు చేతులను ఈ నీటిలో ముంచి.. మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిమ్మతొక్కతో గోళ్లపై సున్నితంగా రుద్దితే.. నెయిల్ పాలిష్ సులువుగా ఊడిపోతుంది.
గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలపాలి. అందులో గోళ్లను ముంచి.. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత బయటికి తీసి.. నిమ్మతొక్కతో గోళ్లను బాగా రుద్దాలి. ఇలా చేస్తే నెయిల్ పాలిష్ తేలికగా రాలిపోతుంది.
ఇంట్లో వాడే సాధారణ తెల్లని టూత్‌పేస్ట్ కూడా ఇందుకు బెస్ట్‌గా పనికొస్తుంది. గోళ్లపై కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి.. దానిపై బేకింగ్ సోడా చల్లాలి. కొద్దిసేపు మెల్లగా రుద్ది.. కొద్దిసేపటి తరవాత తడి కాటన్‌తో తుడిచేయాలి.
ఉడకబెట్టిన బంగాళదుంప తొక్కను నిమ్మరసం, పంచదారతో కలిపి గోళ్లపై రాయాలి. కాసేపయ్యాక కాటన్ గుడ్డతో రుద్దేస్తే.. నెయిల్ పాలిష్ పోతుంది.