భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో వేరియేషన్స్ చూపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అందాల భామ రెజీనా కసాండ్రా. తను ప్రధాన పాత్రలో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జులై ఒకటిన ‘ఆహా’లో విడుదల కానున్నది. ఈ సందర్భంగా తన మనోభావాలు..
డ్రీమ్ డైరెక్టర్?
వీళ్లతో చేయాలి, వాళ్లతో చేయాలని ఎప్పుడూ అనుకోను. కథలోని పాత్రకు నేను సంపూర్ణ న్యాయం చేయగలనని పూర్తిగా నమ్మే దర్శకుడే నా అభిమాన దర్శకుడు.
అవకాశం వస్తే నటించేందుకు ఇష్టపడే హాలీవుడ్ సినిమా?
‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’.
ప్రయాణాల్లో కచ్చితంగా వెంట ఉంచుకునే మూడు వస్తువులు?
లిప్‌బామ్, ఫేస్‌వాష్.. ఇప్పుడు శానిటైజర్ తప్పనిసరి కదా!
మీ ఆహారపు అలవాట్లు?
తక్కువ ఫ్యాట్ ఉన్న ఆరోగ్యకరమైన పదార్థాలే తీసుకుంటా.
ఫేవరెట్ రెస్టారెంట్?
చెన్నైలోని దాలియా. జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.
మీ అందం వెనుకగల రహస్యం?
ఎప్పుడూ శుభ్రంగా కనిపించేందుకు ప్రయత్నిస్తా.
ఎలాంటి పుస్తకాలు చదువుతారు?
నేను పెద్దగా పుస్తకాలు చదవను. ప్రస్తుతం పుస్తకాలకంటే సినిమా స్క్రిప్టులు చదవడమే ఎక్కువవుతున్నది. ఆడియోల్లో వినడం కంటే, అక్షరాల్లో చదివితేనే మంచిదని భావిస్తా.
ట్రావెలింగ్ ప్లాన్స్?
ఈ మధ్యనే మేఘాలయ వెళ్లొచ్చా. నేను ఎక్కువగా వెళ్లేందుకు ఇష్టపడే ప్రాంతాల జాబితాలో దుబాయ్, సెర్బియా, ఫ్రాన్స్ ముందుంటాయి.
మొదటిసారి కెమెరాని ఫేస్ చేసినప్పుడు?
ఏం భయపడలేదు.
ఎలాంటి పాత్రలంటే ఇష్టం?
వైవిధ్యంగా ఉండే ఏ పాత్ర అయినా.
కథల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలు?
మొదట్లో తడబడ్డాను. ఇప్పుడు మాత్రం నాకు నచ్చితేనే..
ఆదర్శంగా తీసుకునే నటులు?
గెరార్డ్ బట్లర్. ఆయన ఏ పాత్రలో అయినా ఒదిగిపోగలరు.