మధుర జ్ఞాపకాలను భద్రంగా దాచుకోవాలంటే ఫొటోలకు మించిన మార్గం లేదు. వాటిని ఫ్రేమ్ కట్టి ఎదురుగా పెట్టుకుంటే.. చూసినప్పుడల్లా మనసుకు మహదానందమే. అయితే ఇక్కడో సమస్య ఉంది. ఆ ఫొటో ఫ్రేములు పెట్టుకోవాలంటే టేబుల్ కావాలి. లేదంటే గోడకు మేకు కొట్టాలి. ఈ రెండిటి అవసరం లేకుండా ప్రీమియం క్వాలిటీ ఆక్రిలిక్ ఫొటోలు మార్కెట్లోకి వచ్చాయి.
అద్దంలాంటి ఫినిషింగ్ ఉన్న ఈ ఫొటోలను నేరుగా గోడకే అతికించేయవచ్చు. చిన్నది, పెద్దది, మరీ పెద్దది.. కావలసిన సైజులో తయారు చేయించుకోవచ్చు. హాలు, బెడ్రూమ్, లివింగ్రూమ్.. ఎక్కడైనా సరే, ఆ గదికే అందాన్ని తీసుకొస్తాయి. మీకూ నచ్చాయా? అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి మరి!