గురువారం 02 ఏప్రిల్ 2020
Zindagi - Feb 16, 2020 , 23:10:36

స్టేజీపై వణుకుతున్నారా?

స్టేజీపై వణుకుతున్నారా?

నలుగురి ముందు మాట్లాడాలని ఉండనిదెవరికి? కానీ వారిలోని కొన్ని లోపాలే స్టేజీ ఎక్కితే వణికిస్తాయి. ఎంత విషయ పరిజ్ఞానమున్నా స్టేజీపైకి ఎక్కితే భయపడే వారు చాలామంది ఉంటారు. అలాంటివారి కోసం ఈ టిప్స్‌.

  • స్టేజీపై ఎక్కి ఇప్పటివరకూ ప్రసంగించని వారు చిన్న చిట్కాలు పాటించాలి. అద్దం ముందు నిల్చొని సాధన చేయాలి. రికార్డింగ్‌ చేసుకొని వినాలి. వీటన్నింటికంటే సభల్లో ఇతరులు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వారి హావభావాలను గమనించాలి. 
  • స్టేజీ ఎదురుగా ఉన్న జనాల్ని చూసి కంగారుపడిపోవద్దు. వాళ్లు కూడా మనలాంటి మామూలు మనుషులే అని గ్రహించాలి. ఇలాంటి సందర్భాల్లో మైక్‌తో పాటుగా చిన్న పోడియం ఉండేలా జాగ్రత్తపడితే, మన భయాన్ని కప్పిపుచ్చుకోవచ్చు. ప్రసంగం మధ్యలో సందర్భాన్ని బట్టి శ్రోతల్ని నవ్వించాలి.
  • స్టేజీ ఎదురుగా ఉన్నవారి ముఖాల్ని చూడవద్దు. వారి తలల మీదుగా చూడాలి. సభలో కూర్చున్నవారిలో తెలిసిన వారిని చూస్తూ కూడా మాట్లాడవచ్చు. చాలామంది పెద్ద పెద్ద వ్యాసాలు రాసుకొని బట్టీ పట్టి మరీ చెబుతుంటారు. స్టేజీ ఎక్కినప్పుడు బట్టీ పట్టిందేమీ గుర్తుండదు.


logo
>>>>>>