గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 23, 2020 , 01:06:26

ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి

ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి

 ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

తుర్కపల్లి: రానున్న  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల  ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామ ఇన్‌చార్జీలు పట్టభద్రుల వివరాలు సేకరించాలన్నారు. 2017సెప్టెంబర్‌కు ముందు పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు.   ఈ సమావేశంలో ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, వైస్‌ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్‌, కోఆప్షన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు రహమత్‌షరీఫ్‌, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్‌, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్‌, నాయకులు జక్కుల వెంకటేశ్‌,   శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప, శ్రీకాంత్‌, అమరసింహారెడ్డి,  శ్రీనివాస్‌ , భాస్కర్‌యాదవ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

డయాలిసిస్‌ కేంద్రం సందర్శన 

ఆలేరు టౌన్‌:  ఆలేరులోని డయాలిసిస్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితులతో  ఆమె కొద్దిసేపు మాట్లాడారు. యాదగిరిగుట్టకు ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రి స్టేషన్‌గా మార్చినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం ఆలేరులోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ వద్ద సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన శంకరయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశం, కౌన్సిలర్‌ రాయపురం నర్సింహులు, మాజీ వైస్‌ ఎంపీపీ గ్యాదపాక నాగరాజు, మాజీ సర్పంచ్‌ రజిని, నాయకులు కృష్ణ, రవి, నాగరాజు, ఫయాజ్‌, మామిడాల భాను, నర్సింహులు పాల్గొన్నారు.
VIDEOS

logo