ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 26, 2021 , 00:17:16

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహణ

ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై శకటాల ప్రదర్శన రద్దు

ప్లాస్టిక్‌ జాతీయ త్రివర్ణ పతాకం ఎగురవేస్తే కఠిన చర్యలు

భువనగిరి, జనవరి 25: గణతంత్ర వేడుకలను ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశాలు జారీ చేశారు. గతానికి భిన్నంగా గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వ అభివృద్ధి పథకాల శకటాల ప్రదర్శనను సైతం రద్దు చేశారు. వేడుకల్లో త్రివర్ణ జెండాలను ఎగుర వేసే క్రమాల్లో ప్లాస్టిక్‌ రహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ త్రివర్ణ పతాకం ఎగురవేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలను సైతం జారీ చేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అధికారులు, ప్రజలు, ఇతరత్రా సిబ్బంది కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సామాజిక దూరం, వ్యక్తిగత శానిటైజేషన్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉదయం 9గంటలకు జెండా ఆవిష్కరణ..

కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసంగిస్తారు. అందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

VIDEOS

logo