శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Mar 23, 2020 , 23:22:07

ఇండ్లకే పరిమితం..

ఇండ్లకే పరిమితం..

  • కరోనాపై యుద్ధం కొనసాగిస్తున్న జిల్లా వాసులు
  • రెండోరోజూ నిర్మానుష్యంగా పట్టణాలు, రోడ్లు
  • గ్రామాలకు ఇతరులు రాకుండా పలుచోట్ల కంచెలు
  • సరుకుల కోసం ఇంటికొక్కరు మాత్రమే బయటికి
  • పదిరోజుల కర్ఫ్యూతో ఊర్ల బాటపట్టిన జనం
  • అత్యవసరం కాకున్నా రోడ్డెక్కితే వాహనాలు సీజ్‌

‘కరోనాపై యుద్ధం సాగించేందుకు ఇళ్లకే పరిమితమైన జిల్లా ప్రజలు తమ సంకల్పబలాన్ని చాటుతున్నారు. సోమవారం కూడా స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం కూరగాయలు, నిత్యావసరాల కోసం జనాలు రోడ్లపైకి రావడంతో రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, సూపర్‌ మార్కెట్లు రద్దీగా మారాయి. అయితే పోలీసులు రద్దీ నియంత్రణకు చేపట్టిన కఠిన చర్యలతో కొద్దిసేపటికే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగి.. రణగొణ ధ్వనులు బదులు ఎటుచూసినా ప్రశాంత వాతావరణం కన్పించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆటోలు ఆగిపోయాయి. హోటళ్లు.. రెస్టారెంట్లు మూతపడ్డాయి. అత్యవసర సేవలు తప్ప అంతా బందయ్యాయి. తమకు తామే స్వీయ నియంత్రణ పాటించిన జనం.. సరుకుల కోసం మాత్రమే ఇంటికొక్కరుగా బయటికి వచ్చారు. గ్రామాలకు ఇతరులు రాకుండా పలుచోట్ల కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. పదిరోజుల కర్ఫ్యూతో జనం ఊర్ల బాటపట్టగా.. మొదటిరోజు షరతులతో అనుమతించిన పోలీసులు నేటి నుంచి మాత్రం రోడ్లపై తిరిగేందుకు వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఖరాఖండిగా చెబుతున్నారు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.’

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ పిలుపుతో నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ చౌటుప్పల్‌లో విజయవంతమైంది. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. జనాలు బయటకు రాకపోవడంతో చౌటుప్పల్‌ మొత్తం బోసిపోయింది. రోడ్ల న్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యంరద్ధ్దీగా ఉండే బస్టాండ్‌లో జనాలు లేక వెలవెలపోయింది. వైన్స్‌షాపులు, షాపిం గ్‌ మాల్స్‌తో సహా అన్నీ షాపులు మూతపడ్డాయి. అత్యవసర సేవలైన మెడికల్‌ షాపులు, పెట్రోల్‌బంక్‌లు, కిరాణ షాపులు తెరిచి ఉంచారు. కాగా రోడ్లపైకి వెళ్లిన టూవీలర్‌ వాహనదారులకు, ప్రజలకు పోలీసులు కరోనా వ్యాప్తి పై అవగాహన కల్పించారు. అందరూ ఇండ్లలోనే ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటికి రావద్దని తెలిపారు. కారణం లేకుండా బయటికి వస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అకారణంగా వాహనాల్లో బయటికి వస్తే వాహనాలను లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు సీజ్‌చేస్తామని తెలిపారు. 

రెట్టింపైన కూరగాయల రేట్లు...

  చౌటుప్పల్‌లో కూరగాయల రేట్లు అమాంతం పెరిగాయి. నిన్న,మొన్నటితో పోల్చుకుంటే వాటి రేట్లు డబు ల్‌ అయ్యాయని చెప్పవచ్చు. రెండు రోజుల క్రి తం రూ. 15పలికిన టమోటా సోమవారం రూ. 30 పలికింది. వంకాయ, బీరకాయ, ఆలుగడ్డ రేట్లు సైతం రెట్టిం పయ్యాయి. కూరగాయాల మార్కెట్‌లోని అన్ని షాపు లు తెరుచుకులేదు. కొన్ని షాపులను మాత్రమే తెరిచిఉంచడం, తెరిచిన షాపుల్లోనూ సరిపడా కూరగాయాలు లేకపోవడంతో కూరగాయల రేట్లకు రెక్కలొచ్చాయి. 

రేట్ల పెంపుపై ఆర్డీవో సీరియస్‌..

కూరగాయల రేట్లను అమాంతంగం పెంచడం పై ఆర్డీవో సూరజ్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. కూరగాయల రేట్లను పెంచి అమ్ముతున్నారన్న సమాచారంతో మున్సిపాలిటీ కేంద్రంలోని కూరగాయల విక్రయ మడిగలను ఆయన సందర్శించారు. రేట్లను పెంచి అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌నగర్‌ కూరగాయల మార్కెట్‌ ధరలకనుగుణంగా ఇక్కడ కూరగాయాలను విక్రయించాలన్నారు. 

మోత్కూరులో.. 

మోత్కూరు : కరోనా వైరస్‌ నుంచి ప్రజలను విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం మో త్కూరు  మండలంలో  బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది.  ప్రజల ఆరోగ్యరిత్యా ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌కు అన్ని వర్గాల ప్రజలు, వాహనదారులు సహకరించాలని ఎస్సై హరిప్రసాద్‌ కోరారు. 

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి..

మోత్కూరు మున్సిపాలిటీలో దోమల నివారణకు మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంతో పాటు మదిర గ్రామా ల్లో దోమల మోత వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. 

చౌటుప్పల్‌ రూరల్‌లో..

చౌటుప్పల్‌ రూరల్‌ : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చౌటుప్పల్‌ మండలవ్యాప్తంగా సోమవారం బంద్‌ కొనసాగింది. ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించారు. మండలపరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ వైవు వా హనాలు ఎలాంటి రాకపోకలు సాగించలేదు. దీంతో రహదారి నిర్మానుష్యంగా మారింది. నల్లగొండ వైవు మాత్రం వాహనాల రాకపోకలు కొనసాగాయి. ఇందులో ద్విచక్రవాహనాలు, కార్లు మాత్రమే కనిపించాయి. 

సంస్థాన్‌నారాయణపురంలో..

 సంస్థాన్‌నారాయణపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జన తా కర్ఫ్యూను (లాక్‌డౌన్‌)ఈ నెల 31 వరకు కొనసాగించాలని ఆదేశించడంతో సోమవారం కూడా గ్రామాల్లో ప్రజలు ఇంట్లోనే ఉండిపోయారు. రోడ్లపై పోలీసులు ద్విచక్రవాహన దారులను ఆపి అవగాహన కల్పించారు.

VIDEOS

logo