‘మహా’ ముస్తాబు

- నేడు మహాశివరాత్రి
యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : మహాశివరాత్రి వేడుకలను శుక్రవారం జరుపుకొనేందుకు జిల్లాలోని వివిధ శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఆలయాలకు రంగులు, సున్నం వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసిన నిర్వాహకులు రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అంతేగాకుండా వివిధ గ్రామాల్లోని శివాలయాలు శివరాత్రి పండుగ శోభను సంతరించుకున్నాయి. యాదాద్రిలోని శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో ఉత్సవాలకు శ్రీకారం జరిగింది. లోకకల్యాణార్థం గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. భువనగిరిలోని శ్రీపచ్చలకట్ట సోమేశ్వరాలయం, దక్షిణ కాశీగా పిలుచుకునే కొలనుపాకలోని వీరశైవుల పుణ్యక్షేత్రమైన సోమేశ్వరాలయం, బీబీనగర్ మండలంలోని పడమటి సోమారంలోని శ్రీలింగబస్వేశ్వరస్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కాకతీయుల కాలం నాటి ఎంతో మహిమాన్వితమైన యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలోని పార్వతీపరమేశ్వరులు కొలువుదీరిన శివాలయంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉపవాస దీక్షలు విడిచే భక్తులకు ప్రసాదం అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.
భువనగిరిలో...
మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయం, కన్యకాపరమేశ్వరాలయం, దక్షణేశ్వరాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు