అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట

భువనగిరి అర్బన్: వాహనదారులు రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచుకొని పాటించడం వల్ల ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చునని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీసీపీ నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడినవారికి రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారిని కాపాడినవారమవుతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమాన తప్పదని హెచ్చరించారు.
అన్నిదానాల కన్నా రక్తదానం మిన్న..
జిల్లా రవాణాశాఖాధికారి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ అన్నిదానాల కన్నా రక్తదానం మిన్న అన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించడంతోపాటు రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు సీటుబెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చ్యలు తప్పవని హెచ్చరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ లక్ష్మీనర్సింహరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రమాద బాధితులు, గర్భిణుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సంవత్సరానికి జిల్లాలో 10వేల యూనిట్లు రక్తం అవసరం ఉండగా కేవలం 8వేల యూనిట్లు మాత్రమే అందించగలుగుతున్నామని చెప్పారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. పట్టణ సీఐ కాశిరెడ్డి, ఎంవీఐలు శ్రీకాంత్, రఘుబాబు, ఏవోలు హరిప్రసాద్, సుదర్శన్, జగన్నాయక్ ఆర్య, కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డులు మల్లేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్