నేడే ఫలితం

- - ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం
- - నేడు తేలనున్న ఆరు మున్సిపాలిటీల ఫలితాలు
- - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- - 103 వార్డులకు బరిలో 433 మంది
- - సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు
- - ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రమేశ్, డీసీపీ నారాయణరెడ్డి
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి నమస్తేతెలంగాణ: మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు, యాదగిరిగుట్టకు సంబంధించిన ఆరు మున్సిపాలిటీల ఓట్లను భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉండగా భూదాన్‌పోచంపల్లిలోని 1వ వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 103 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆయా వార్డుల్లో 433 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రమేశ్, డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షించారు.
మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఈ నెల 22న పోలింగ్ జరుగగా.. ఓట్ల లెక్కింపును భువనగిరి పట్టణంలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కళాశాల ఏ బ్లాకులో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, బీ బ్లాకులో చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, మోత్కురు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఆలేరు, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కురు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో మొత్తం 104 వార్డులుండగా.. భూదాన్‌పోచంపల్లిలోని మొదటి వార్డు ఏకగ్రీవమైంది. మిగితా 103 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆయా వార్డుల్లో 433 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారి భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనున్నది. అరోరా కళాశాలలో స్ట్రాంగ్ రూంలో భారీ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు 103 టేబుల్స్, ఆర్వో కోసం మరో టేబుల్‌ను ఏర్పాటు చేశారు. వీరికి తోడ్పాటును అందించేందుకు మరి కొంత మంది అధికారులు, సిబ్బందిని నియామకం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్షణ్ణంగా పరిశీలించడానికి పరిశీలకులను కూడా నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డులవారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వారీగా ఓట్లను 25 చొప్పున బండిల్స్‌గా తయారు చేసి డ్రమ్ములో వేసి మిక్సింగ్ చేసిన అనంతరం ప్రతి టేబుల్ పైన 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. అభ్యర్థివారీగా ట్రేలు ఏర్పాటు చేసి వచ్చిన ఓట్లను ఏజెంట్లకు చూపిస్తూ ట్రేలో వేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఏజెంట్ల సమక్షంలో అభ్యర్థి బ్యాలెట్ పేపర్లను కవర్లో పెట్టి సీల్ వేస్తారు. ఏజెంట్లు అందరూ ఉదయం 6.30 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి టేబుల్‌కు అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు..
కౌంటింగ్ ప్రారంభం కాగానే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం 8గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అనంతరం రెండో దశలో బ్యాలెట్లలోని ఓట్లను లెక్కిస్తారు. మూడో దశలో ఎంపిక చేసిన 103 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
మూడంచెల భద్రత..
రాజకీయ పార్టీల నుంచి ఎదురైన అనుమానాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సెంట్రల్ పోలీసు ఫోర్స్‌తో పాటు, స్థానిక పోలీసులు స్ట్రాంగ్ రూం ఉన్న అరోరా కళాశాలలో పూర్తి స్థాయి భద్రతను 24 గంటలు కొనసాగిస్తున్నారు. అలాగే రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైట్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపర్చారు. రాజకీయ పార్టీలకు ఒకరు చొప్పున స్ట్రాంగ్ రూం వద్ద తమ ఏజెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి తనిఖీ చేస్తున్నారు.
27న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ పూర్తయిన అనంతరం ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ఈ నెల 27వ తేదీన చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పర్యవేక్షణలో చైర్మన్ ఎంపిక జరుపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వి.నాగిరెడ్డి ఉత్తర్వుల జారీ చేశారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి రాజకీయ పార్టీల నాయకులకు శిక్షణ ఇచ్చాం. మొత్తం ఆరు మున్సిపాలిటీల్లో 103 టేబుల్స్ ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్, కంప్యూటర్లు సిద్ధంగా ఉంచాం. 360 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 206 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, అదనంగా మరో 50 మంది స్టాఫ్‌ను అందుబాటులో ఉంచాం. సాయంత్రం 5 గంటల లోపు విజేతలను ప్రకటించే అవకాశం ఉంది.
-అనితారామచంద్రన్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
కట్టుదిట్టమైన బందోబస్తు..
కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. 300 మంది పోలీస్ అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉంటారు. ఇద్దరు డీసీపీలు, 6 ఏసీపీలు, 10 సీఐలు, 40 ఎస్సైలు ఉంటారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచాం. మూడంచెల భద్రత కొనసాగుతున్నది. మీడియా, అధికారులు, అభ్యర్థులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాం.
-నారాయణరెడ్డి, డీసీపీ
తాజావార్తలు
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు