భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరిత హోటల్లో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్‌కుమార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌తో కలిసి పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు.
- ప్రమాద ప్రదేశాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
తాడ్వాయి, ఫిబ్రవరి13 : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరిత హోటల్లో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్‌కుమార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్‌తో కలిసి పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగితెలుసుకున్నారు. ఇంకా పనులు పూర్తి కానివి ఉన్నా యా? అని ఆరా తీశారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ఇదే ఆఖరి సమావేశం అని భక్తులకు సేవలందించేందుకు అధికారులు సిద్ధం కావాలని సూచించారు. గతంలో కంటే ఎక్కువగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే మిగితా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని జాతర విజయవంతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. రహదారుల వెంట భక్తుల వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాకుండా జంపన్నవాగులో ప్రమాదాలు జరుగ కుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్టాళ్ల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రపంచానికి తెలిసేలా జాతరలో ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, టాయిలెట్లు, ఫ్లడ్‌లైట్లు తదితర అన్ని ఏర్పాట్లు కల్పించాలని, కల్యాణకట్టలో భక్తుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్‌కుమార్ మాట్లాడుతూ చిలుకలగుట్ట, జంపన్నవాగు, గద్దెల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికి కేటాయించిన ప్రదేశంలో వారే ఉండేలా జోనల్ సెక్టోరల్, జోనల్ అధికారులు చూడాలని ఆదేశించారు. జాతర ప్రతిష్టకు భంగం కలుగకుండా ప్రతి అధికారి సహకరించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలోఅదనపు కలెక్టర్ శ్రీజ, ఏఎస్పీ సంకీర్త్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, దేవాదాయశాఖ అధికారి రాజేంద్రం పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

