హనుమకొండ, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. కొత్త ప్రాజెక్టులు, నిధుల జాబితాలో ఓరుగల్లు ప్రస్తావనే లేదు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి అనుసంధానంగా ఉన్న వరంగల్-కాజీపేట రైల్వే మార్గంలోనూ కొత్తగా అభివృద్ధి ప్రణాళికలు పేర్కొనలేదు. వరం గల్ మహానగర అభివృద్ధి కోసం ఎలాంటి పథకాన్ని చేర్చలేదు. రామప్ప అభివృద్ధిని కనీసం ప్రస్తావించలేదు. దీంతో ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
కాజీ పేట రైల్వే డివిజన్ విషయంలోనూ మరోసారి నిరాశే మిగిలింది. కాకతీయ మెగా టెక్స్టై ల్ పార్కు అభివృద్ధికి నిధుల కేటాయింపుపైనా స్పష్టత ఇవ్వలేదు. స్మార్ట్ సిటీ పథకం అర్ధాంతరం గా ముగిసిన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి నిధులపరంగా కష్టాలు మొదలయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరుపై సానుకూల ప్రక టన రాలేదు. మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధుల కేటాయింపును ప్రస్తావించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం మరోసారి మరిచిపోయింది.
రైల్వే వ్యాగన్ తయారీ ప్రాజెక్టును కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేసినట్లు… ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లను తయారు చేయనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించినా నిధుల కేటాయింపు, ప్రాజెక్టు పూర్తిపై స్పష్టత ఇవ్వలేదు. రామగుండం, భూపాలపల్లి, మేడారం, ఏటూరునాగారం, మణుగూరు మార్గంలో 207 కిలో మీటర్లు, కాజీపే ట(నష్కల్)-కరీంనగర్ మధ్య 62 కి.మీ, డోర్నకల్-మిర్యాల గూడ మధ్య 105 కి.మీ, డోర్నకల్-గద్వాల మధ్య 296 కి.మీ, కాజీపేట-భూపాలపల్లి మధ్య 64 కిలోమీటర్ల రైల్వే మార్గానికి నిధులు కేటాయించలేదు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసమూ నిధులు ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీకి 360 ఎకరాల్లో సొంత క్యాంపస్‌ను నిర్మించేందుకు కేంద్రం గతంలో రూ.890 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి ముందుకు సాగడం లేదు.
పోచమ్మమైదాన్ : కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ మినహాయింపులు పెంచకపోవడం వల్ల సామాన్య ప్రజలకు భారంగా మారింది. రైతులు, గ్రామీణ ప్రాంతాల రైతులకు ఎక్కువ నిధులు కేటాయించకపోవడం బాధాకరం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి ప్రకటించలేదు. సీనియర్ సిటిజన్స్ల వడ్డీపై టీడీఎస్ తగ్గించడం సంతోషం. ఐటీ, సైన్స్, టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
– త్రిపురనేని గోపీచంద్, ప్రముఖ అకౌంటెంట్