చెన్నారావుపేట, డిసెంబర్ 17: నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం లాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్‌ఫ్ చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని అనేక జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీల ద్వారా వైద్య సేవలను పొందొచ్చని ఆయ న తెలిపారు. మండల కేంద్రానికి చెందిన దూపటి సదయ్యకు రూ. ఒక లక్ష విలువైన ఎల్వోసీ పత్రాలను వైద్య ఖర్చులకు బాధిత కుటుంబ సభ్యులకు పెద్ది అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి పాల్గొన్నారు.
వధూవరులకు ఎమ్మెల్యే పెద్ది ఆశీర్వాదం
చెన్నారావుపేటకు చెందిన ఆడెపు రవి-ప్రవళిక వివా హ వేడుకలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ రఫీ, నాయకులు కృష్ణ చైతన్య, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కుసుమ నరేందర్, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి పాల్గొన్నారు.
ముగ్ధుంపురంలో..
నర్సంపేటరూరల్ : మండలంలోని పాతముగ్ధుంపురం గ్రామానికి చెందిన సుంకరి చిన్న నర్సయ్య-భాగ్య దంపతుల కూతురు సంగీత వివాహం శ్రావణ్‌కుమార్‌తో శనివారం జరిగింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శరన్రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి లావణ్య-సాంబయ్య, నాయకుడు కంది కృష్ణచైతన్య, కల్లెపెల్లి సురేశ్, ఈదునూరి రమేష్, నమిండ్ల సురేష్, బషీర్, కుమారస్వామి, రాజ్‌కుమార్, రాజు, సన్నీ, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.