మంగపేట, నవంబర్ 16 : మండలంలోని బ్రాహ్మణపల్లి హాబిటేషన్ పరిధి అంజనీపురం గ్రామంలో బుధవారం ఆర్ఓఎఫ్ఆర్ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభకు 18 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. కాగా వీరు పొరుగు రాష్ర్టానికి చెందిన గొత్తికోయలుగా గుర్తించిన అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్, మంగపేట అటవీ రేంజ్ అధికారి షకీల్‌పాషా, ప్రత్యేక అధికారి సునీల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, బీట్ అధికారులు, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తాడ్వాయి: మండలంలోని గంగారం, అన్నారం, ఆశన్నగూడెం, ఎల్లపూర్, అంకంపల్లి గ్రామాల్లో ఆర్ఓఎఫ్ఆర్ గ్రామ సభలు నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్, డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం వెల్నెస్ సెంటర్‌తో పాటు అంగన్వాడీ సెంటర్లను డీఎంహెచ్‌వో పరిశీలించారు.
కాటారం : మండలంలోని కొత్తపల్లి, గుమ్మలపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్వే చేసిన దరఖాస్తుల వివరాలు చదివి వినిపించి తీర్మానాలు చేశారు. గుమ్మల్లపల్లిలో 55 దరఖాస్తులకు ఇద్దరు రైతులు, కొత్తపల్లిలో 168 దరఖాస్తులకు 19 మంది అర్హత కలిగి ఉన్నారన్నారు. జాదురావుపేటలో 165 దరఖాస్తులకు ఒక్కరికీ అర్హత లేదన్నారు. గ్రామసభల్లో ఎస్సై శ్రీనివాస్, ఎఫ్ఆర్వో మధుబాబు, ఉపేంద్రయ్య, ఎఫ్ఆర్సీ చైర్మన్, సభ్యులు, సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు.
గోవిందరావుపేట : అర్హులందరికీ పోడు పత్రాలు ఇస్తామని డీఆర్డీఏ పీడీ నాగపద్మజ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పోడు రైతులతో గ్రామసభ నిర్వహించి అర్హుల జాబితాను ప్రకటించారు. గ్రామసభలో ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ అల్లం రాజ్‌కుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌తో పాటు సర్పంచులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ : మండలంలోని లక్ష్మీపురంలో పోడు భూములపై సర్పంచ్ చెన్నోజు లక్ష్మీనారాయణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. జీపీలో అటవీ భూములు లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదివి తిరస్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ వెంకట్రాములు, ఎంపీటీసీ బానోత్ భాస్కర్, పంచాయతీ సెక్రటరీ జాడీ రమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వాజేడు: మండలంలోని కోంగాల, గుమ్మడిడొడ్డి గ్రామా ల్లో ఆర్వోఎఫ్ఆర్ గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, తహసీల్దార్ గూడూరు లక్ష్మణ్, ఎఫ్ఆర్వో అనంతరామిరెడ్డి, ఎంపీవో శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శులు ముద్దెబోయిన రేఖశ్రీ, నక్క శిరీష, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వెంకటాపురం(నూగూరు) : మండల పరిధిలోని వీరభద్రవరంలో నిర్వహించిన గ్రామసభలో అర్హులను గుర్తించా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాయం రమణ, తహసీల్దార్ అంటి నాగరాజు, ఎంపీడీవో అడ్డూరి బాబు, సర్పంచ్ సమ్మక్క, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.