Warangal : శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టర్ గోపి

ఖిలావరంగల్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం వరంగల్ డీఆర్డీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ఇస్తున్న శిక్షణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే శిక్షణ పొందుతున్న యువతకు కావలసిన మౌలిక సదుపా యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు కేవలం సేల్స్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా నిష్ణాతులుగా తయారు చేసే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు.
యువత తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూనే ప్రతిది సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. శిక్షణలో భాగంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న హెచ్ఆర్తో కూడా ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. అనంతరం శిక్షణలో భాగంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన యువకులకు కలెక్టర్ బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సంపత్‌రావు, అంజలి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

