వరంగల్‌లో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య
ఎల్బీనగర్ | వరంగల్‌లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

వరంగల్: వరంగల్‌లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ చెందిన చాంద్‌పాషా తన తమ్ముడు షఫీతో కలిసి పశువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి.

అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు షఫి.. మరికొందరితో కలిసి మంగళవారం రాత్రి చాంద్‌పాషా కుటుంబంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. దీంతో చాంద్ పాషా (50), ఖలీల్ (40), సమీరా (42) అక్కడికక్కడే మృతిచెందారు. సమద్, ఫహద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆస్తి తగాదాలే ఘటనకు కారణమని వెల్లడించారు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

