హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 2: ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 14 క్రికెట్ జట్టును ఎంపిక చేసే క్రమంలో సెలెక్షన్ లో పాల్గొని ప్రతిభ కనబరిచిన 8 క్రికెట్ జట్లను ఎంపిక చేశారు. శుక్రవారం ఉదయం నుంచి కరుణాపురం వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో ఎంపికలు నిర్వహించగా ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూల నుంచి భారీ సంఖ్యలో సుమారు 400 మందిపైగా హాజరుకాగా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 8 జట్లను ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
ఎంపికైన జట్లకు ఈనెల 11 నుంచి పోటీలను లీగ్ తరహా పోటీలు నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తుది అండర్-14 జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్ది ప్రవీణ్‌గౌడ్, ఉపాధ్యక్షులు అచ్చ వెంకటేశ్వరరావు, తోట రాము, మాజీ కార్యదర్శి మార్నేని ఉదయ్భానురావు, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్, విజయ్, శంకర్, మెతుకు కుమార్, సురేష్ , మట్టెడ కుమార్, బండారి ప్రభాకర్, ఏ.వేణుగోపాల్, అఫ్జల్, రాజ్‌కుమార్, సదానంద్యాదవ్ పాల్గొన్నారు.