వరంగల్ కేంద్రంగా సాగిన ఉద్యమం యావత్ తెలంగాణకే దిక్సూచి : గుడిమళ్ల రవికుమార్
వరంగల్ కేంద్రంగా సాగిన ఉద్యమం యావత్ తెలంగాణకే దిక్సూచిగా నిలిచిందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ గుర్తుచేశారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 10 : వరంగల్ కేంద్రంగా సాగిన ఉద్యమం యావత్ తెలంగాణకే దిక్సూచిగా నిలిచిందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రతి ఉద్యమకారుడిని పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు ఈనెల 13, 14, 15 తేదీల్లో హనుమకొండ కేంద్రంగా ‘రెండోదశ తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం హనుమకొండ కాకతీయ కాలనీలోని తెలంగాణ ఉద్యమకారుల కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు రెండోదశ ఓదార్పు యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ 13న 10:30 గంటలకు ములుగురోడ్ జంక్షన్ నుంచి ప్రారంభమై హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ సెంటర్, అమరవీరుల స్తూపం, ఫాతిమానగర్, కాజీపేట మీదుగా మడికొండ వరకు కొనసాగుతుందని, 14న 10 గంటలకు హనుమకొండ పరిసర ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. 15న 10 గంటలకు కాజీపేట ప్రాంతంలో యాత్ర నిర్వహించబడుతుందని, ఈ యాత్ర ద్వారా ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, గాయాలపాలై, జైళ్లకు వెళ్లి, ఆర్థికంగా నష్టపోయి, అనారోగ్యంతో దగాపడ్డ ప్రతి ఉద్యమకారుడి ఇంటికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చడంతో పాటు వారి కుటుంబ ప్రస్తుత ఆర్థిక, జీవన స్థితిగతులను సమగ్రంగా రికార్డు చేస్తామని తెలిపారు.
కాళోజీ నారాయణరావు, ఆచార్య జయశంకర్, ఆచార్య జనార్దన్ రావు వంటి మహనీయుల స్ఫూర్తితో, కాకతీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ, తుమ్మల పాపిరెడ్డి తదితరుల మార్గదర్శకత్వంలో ఐదు దశాబ్దాల పాటు ఉద్యమ నినాదం సజీవంగా నిలిచిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదుల నిస్వార్థ పోరాటాలు, ఆటో డ్రైవర్ల ధర్నాలు, విద్యార్థుల వీరోచిత పోరాటాలు, ఉద్యోగుల సకల జనుల సమ్మె, కళాకారుల ధూంధాం, ప్రజా సంఘాల భాగస్వామ్యం చారిత్రాత్మకమైనవని కొనియాడారు.
ఎంత సమయం పట్టినా హనుమకొండ ప్రాంతంలోని ప్రతి ఉద్యమకారుడిని కలిసి, వారి హక్కుల సాధనకు ఐక్యం చేస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ర్టంలో ఉద్యమకారుల ఆత్మహత్యలు పాలకుల వైఫల్యానికి నిదర్శనం, స్వరాష్ర్టంలో నేటికీ ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని, ఇది పాలకుల వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలకులు ఉద్యమకారులను విస్మరించి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. లక్ష్మణ్ గౌడ్ తో పాటు స్వరాష్ర్టంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల కుటుంబాలను అధికారికంగా గుర్తించి, వారికి తక్షణ ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
ఐక్య వేదిక ప్రధాన డిమాండ్లు
1. ఇంటి స్థలం: ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం కేటాయించాలి.
2. పింఛను: ఉద్యమకారులకు నెలకు రూ. 25,000/- చొప్పున గౌరవ పింఛను అందించాలి.
3. ఉద్దీపన పథకం: ఉద్యమకారుల సంక్షేమం కోసం రూ. 10,00,000/- (పది లక్షల రూపాయల) ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అమలు చేయాలి.
4. సంక్షేమ కార్పొరేషన్: రూ. 10,000 కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
5. ఉద్యమకారుల భవనాలు: హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల భవనాలు నిర్మించి, వాటికి ప్రముఖ ఉద్యమకారుల పేర్లు పెట్టాలి.
6. ఆరోగ్య బీమా & రవాణా: ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులందరూ ఈ ఓదార్పు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట కన్వీనర్ నొడపల్లి శ్యామ్ కృష్ణ, హనుమకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఉస్మాన్ అలీ, బొలిశెట్టి అశోక్, రాష్ర్ట కమిటీ నేతలు జినుకుల లక్ష్మణ్ రావు, రామబ్రహ్మచారి, దాసరి జనార్దన్ టి ఎన్ స్వామి 1969 రాష్ర్ట అధ్యక్షులు, ,బాస్కె దశరడం హనుమకొండ కార్యదర్శి, మొగుసాల దేవేందర్ రెడ్డి రాష్ర్ట నాయకులు, అనుముల రమేష్, మాలతీ వరంగల్ జిల్లా మహిళ అధ్యక్షురాలు, సౌరం స్వర్ణ, గుంతటి పద్మ, , హాసన్ పర్తి మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సిరుమళ్ళ సావిత్రి, వై మనోహర్, ధారా సూరి, స్వామి యాదవ్, రాజు ఇమ్మడి శెట్టి, మేకల రవి, అరికే రాంకుమార్, జమ్మల నాగరాజు, ఆర్ గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బి సాగర్, కందగట్ల రమాదేవి, సిరిమల్ల గాయత్రి, పోగుల కిరణ్, రాజు, చెంచు వెంకన్న, జలగం వెంకటయ్య మాజి జడ్పీటీసీ తొర్రురు, కేడల ప్రసాద్, పొలంపల్లి మల్లేశం, కొండేటి నారాయణారెడ్డి, ఎదునూరి రాజమౌళి, శ్రీనివాస్ చారీ, రాంచందర్ రావు , బంక కుమార స్వామి, బొచ్చు కుమార్ పరకాల ఇంచార్జి, చంద్రయ్య, రాయపూరి చంద్రయ్య, పోగుల సుమలత , భైర్య రమేష్, బరిగేలా కృష్ణ మూర్తి, రాంపల్లి శ్రీనివాస్,నల్ల కుమార్, మార్కండేయ, బోయిన విజయకుమార్, వైనాలా మహేందర్, దామెర సాగర్, జక్కుల స్వామి యాదవ్, షేక్ దస్తగిరి, వంగపండ్ల రవి యాదవ్,సరేబోయిన ఉమ, చింత అశోక్, శోభనబోయిన సతీష్, మొలంగూరి నెల్సన్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

