కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి : ఇల్లందుల రాజేందర్
ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని మజ్దూర్ యూనియన్ కాజీపేట ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ ఇల్లందుల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 16 : ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని మజ్దూర్ యూనియన్ కాజీపేట ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ ఇల్లందుల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే 3 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించిన అతిపెద్ద రైల్వే డివిజన్‌గా పేర్కొంటున్న సికింద్రాబాద్ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి, కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
దేశవ్యాప్తంగా కీలక రైల్వే కూడలిగా గుర్తింపు పొందిన కాజీపేట జంక్షన్‌కు ఇప్పటికీ ప్రత్యేక డివిజన్ లేకపోవడం విచారకరమన్నారు. ప్రత్యేక డివిజన్ ఏర్పాటుతో ఉత్తర తెలంగాణలో రైల్వే మౌలిక వసతులు మరింత మెరుగుపడటంతో పాటు రైళ్ల నిర్వహణ, పరిపాలన సులభతరమవుతాయని పేర్కొన్నారు. రైల్వేకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్ తదితర జిల్లాల ప్రజలు చాలాకాలంగా కాజీపేట రైల్వే డివిజన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి కేంద్ర రైల్వే శాఖ వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు పార్టీ రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై ఏకతాటిపైకి రావాలని రాజేందర్ కోరారు. పార్లమెంట్లో కాజీపేట డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా వినిపించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉత్తర తెలంగాణ రైల్వే రంగ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు, రాష్ట్ర సమగ్ర ప్రగతికి కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

