24వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె..!
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది.
మహాదేవపూర్ (భూపాలపల్లి), నవంబర్ 5 : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో జయశంకర్ భూపాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. గత 24 రోజులుగా ఎండనక, వాననక ఉద్యోగులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు కనీస ఉద్యోగ భద్రత లేకపోవడం పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం వేతనాల కోసం చేస్తున్న పోరాటం కాదని, ఆత్మగౌరవం, హక్కులు, ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న న్యాయపోరాటమని స్పష్టం చేశారు.24 రోజులు గడిచినా తమ పోరాట స్ఫూర్తి తగ్గలేదని, న్యాయం జరిగే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్, ప్రధాన కార్యదర్శి మధు, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రఘురాం, సలహాదారులు శ్రీనివాస్, ప్రభాకర్, జిల్లా సమన్వయకర్త ప్రవీణ్, డాక్టర్ జగదీష్, మీడియా ప్రతినిధి రాజు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, ఔషధ పంపిణీ అధికారులు, కాంట్రాక్టు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

