న్యూశాయంపేట, సెప్టెంబర్ 30 : సెయింట్ పీటర్ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడల్లో రాణించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ మాథ్యూస్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇటీవల జరిగిన హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు సీనియర్ సెకండరీ స్కూల్, కళాశాల క్రీడాకారులను కళాశాల ఆవరణలో మంగళవారం సాయంత్రం అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడల పోటీలలో సెయింట్ పీటర్స్ సీనియర్ సెకండరీ స్కూల్,కు చెందిన మిర్జా మహమ్మద్ బేగ్ అండర్-18 బాలుర విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో 3వ స్థానాన్ని, షాట్పుట్ లో పాల్గొని అర్హత సాధించారని, సుల్తాన్ ఖొబైబ్ అహ్మద్ 100 మీటర్ల పరుగు పందెం, షాట్పుట్ విభాగాల్లో పాల్గొని అర్హత సాధించారని తెలిపారు. సెయింట్ పీటర్ విద్యార్థులు భవిష్యత్తులో క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను డైరెక్టర్ డా. జి. సునీతా రెడ్డి, పీటీలు రమేష్, కుమార్ స్వామి సాగర్, కరుణాకర్, ఎన్సీసీ మాజీ ఏఎన్వో జి. ప్రేమ్ చంద్ర శేఖర్ తదితరులు ఘనంగా సత్కరించారు.