PDSU | ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి : మర్రి మహేష్
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా, జూన్ 19: ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు హనుమకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్, ప్రాక్టీస్ హై స్కూల్లో సర్వే నిర్వహించారు.
ఈ స్కూళ్లలో కొన్ని స్కూళ్లలో చదువు చెప్పడానికి టీచర్స్ కోరుతూ ఉందని మర్కజీ హైస్కూల్లో హిందీ బోధించడానికి టీచర్స్కొరత ఉందని గేమ్స్ ఆడిపించడానికి స్కూల్ మొత్తంలో ఒక్కరే పీఈటీ ఉన్నారని మరొకరి అవసరం ఉందని అలాగే టాయిలెట్ సరిపోను లేవని ప్రాక్టీసింగ్ హైస్కూల్లో పర్మినెంట్ టీచర్స్ లేరని డిప్యూటేషన్ మీద వచ్చిన వారే ఉన్నారన్నారు.
బాయ్స్‌కి మొత్తానికి టాయిలెట్స్ లేవని ఉన్న స్కూళ్లలో క్లీన్ చేయడానికి స్కావెంజర్స్ లేరని గర్ల్స్ హైస్కూల్లో వాన పడినప్పుడు గ్రౌండ్లో నీళ్ళు ఆగుతున్నాయని క్లాస్‌రూంలోకి నడవడానికి కూడా ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూల్ సమీపంలోనే ప్రైవేట్ పాఠశాలలు నెలకొన్నాయని వెంటనే డీఈఓ, కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ కార్యవర్గ సభ్యులు వంగవీటి మోహన్, జిల్లా నాయకులు రమణ, విశ్వతేజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

