హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: అతి చిన్న వయసులోనే స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా పదోన్నతి పొందిన హనుమకొండ జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ను కోచ్‌లు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కృషి, పట్టుదల, అంకితభావంతో ఉన్నత స్థానాన్ని అందుకోవచ్చని అశోక్‌కుమార్ నిరూపించారని కొనియాడారు.
యుక్త వయసులోనే ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణమని, స్పోర్ట్స్రంగంలో ఆయన నాయకత్వం మరింత అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్‌లు, సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.