అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే దానం నాగేందర్

వరంగల్ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చతు:స్థానర్చన, స్కందామాత దుర్గార్చన అనంతరం అర్చకులు అమ్మవారిని లలితా మహాత్రిపుర సుందరీదేవీగా అలంకరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
వారిని ఆలయ ఈవో శేషుభారతి స్వాగతం పలికారు. ఆలయ మహామండపంలో ఎమ్మెల్యేలకు ప్రధాన అర్చకులు శేషు శేషవస్త్రాలను బహూకరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. భద్రకాళీ దేవాలయంపై మాడవీధుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఆలయాల రాజగోపురాల తరహాలో కాకతీయ శిల్పరీతిలో నిర్మాణానికి దేవాదాయ శాఖ రూపొందించిన ప్లాన్‌ను వెంటనే ప్రభుత్వానికి అందచేయాలని అన్నారు. మాడ వీదుల నిర్మాణానికి ప్రభుత్వంలో పాటు ఇతర దాతల నుంచి నిధుల సమకూర్చుతామని ఆయన అన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

