Warangal : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. ఎమ్మెల్యే అరూరి రమేశ్

పర్వతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పర్వతగిరి మండల నూతన ప్రధాన, యువజన విభాగం కమిటీల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టంగా బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సంస్థాగతంగా పార్టీని కాపాడుకుంటూ పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు దక్కుతున్నాయన్నారు.
పార్టీ పట్ల విధేయతతో పనిచేసిన వారికి మాత్రమే అవకాశాలు వస్తాయని, ప్రభుత్వం చేస్తున్న పనులను గ్రామీణ స్థాయిలో ప్రజల వద్దకు చేర్చేలా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రంగు కుమార్, యూత్ ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రంజిత్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

