Pension | ఐదు నెలలుగా అందని వృద్ధాప్య పింఛన్.. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పింఛన్ ఐదు నెలలుగా అందకపోవడంతో ఓ వృద్ధుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
వేలేరు, నవంబర్ 18 : వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పింఛన్ ఐదు నెలలుగా అందకపోవడంతో ఓ వృద్ధుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన మూడపు భిక్షపతి (65) వృద్ధాప్య పింఛన్ పొందుతుండగా, గత ఐదు నెలలుగా పింఛన్ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. బుధవారం వేలేరులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు భిక్షపతి అక్కడికి వచ్చాడు.
అయితే ఎమ్మెల్యేను కలిసేందుకు అవకాశం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తనకు రావాల్సిన పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ప్రభుత్వం అందించే పింఛనే తనకు జీవనాధారమని, ఐదు నెలలుగా పింఛన్ అందక నిత్యావసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నానని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి తన పింఛన్ పునరుద్ధరించి న్యాయం చేయాలని భిక్షపతి కోరుతున్నాడు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Rakul | వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్..క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
AP news | పల్నాడులో మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్!
Megastar Chiranjeevi | ఎవరినీ అడగలేదు.. కానీ ఆ డైరెక్టర్‌ను మాత్రం నాతో సినిమా చేయమని అడిగా: చిరంజీవి!
CM Yogi Adityanath: హ్యాట్రిక్‌తో రికార్డులు బద్దలు కొడుతాం: యూపీ సీఎం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

