పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పీచు పదార్థాలు తీసుకోవాలి : డాక్టర్ కూరపాటి రమేష్
పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని డాక్టర్ కూరపాటి రమేష్ సూచించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22: పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని డాక్టర్ కూరపాటి రమేష్ సూచించారు. ప్రపంచ పైల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్, పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ హనుమకొండ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో పైల్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ కూరపాటి రమేశ్మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరకశ్రమ లేకపోవడం, మలబద్ధకం వంటి కారణాల వలన పైల్స్ సమస్య వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్‌కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ కార్యదర్శి కె.శ్రీధర్, కోశాధికారి వినోద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, కంది శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు రవిగుప్తా, కోశాధికారి సుంకరి రవికుమార్, జైన్ కార్యదర్శి రాజిరెడ్డి, ముక్తి హాస్పిటల్ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్ సందడి.. తుది దశకు చేరుకున్న ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

