Power cuts | కరెంట్ కోతలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూరు గ్రామంలో జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి : రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూరు గ్రామంలో జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తారని రైతులకు హామీ ఇచ్చి నేడు కనీసం 5 నుండి 6 గంటలు కూడ సరిగ్గా ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పి రైతులకు మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. కరెంటు లేక రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయి పంట పొలాల భూములు పగుళ్లు తేలుతున్నాయనీ మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

