ధర్మసాగర్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సండ్ర శ్రీ వాస్తవ్ ఎంపికయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా శ్రీ వాస్తవ్ వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆస్నాల శ్రీనివాస్ సోమవారం శ్రీ వాస్తవ్ను అభినందించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు శిక్షణ, డైట్ అందించేందుకు పలు సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకు ప్రత్యేక కోటా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి మంజుల, అధ్యాపకులు అజం ప్రభాకర్, వెంకట్, బాబూరావు, గణేష్, రాజేందర్, యాకూబ్ తదితరులు పాల్గొని శ్రీ వాస్తవ్కు అభినందనలు తెలిపారు.