SGF | ముగిసిన రాష్ర్ట ఎస్జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ టోర్నమెంట్
తెలంగాణ రాష్ర్ట ఎస్జీఎఫ్ అండర్-14 బాలుర, బాలికల అథ్లెటిక్స్ టోర్నమెంట్ కమ్ ఛాంపియన్ షిప్- 2026 ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా రంగారెడ్డి జిల్లా నిలిచింది.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: హనుమకొండ జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహించిన 70వ తెలంగాణ రాష్ర్ట ఎస్జీఎఫ్ అండర్-14 బాలుర, బాలికల అథ్లెటిక్స్ టోర్నమెంట్ కమ్ ఛాంపియన్ షిప్- 2026 ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా రంగారెడ్డి జిల్లా నిలిచింది. రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారని హనుమకొండ జిల్లా ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వాసుదేవరావు తెలిపారు.
ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా రంగారెడ్డి జిల్లా మొత్తం 50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుందన్నారు. బాలుర అండర్-14 ఛాంపియన్ షిప్ ఆదిలాబాద్ జిల్లా 29 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా 19 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుందని, బాలికల అండర్-14 ఛాంపియన్ షిప్ రంగారెడ్డి జిల్లా 31 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని సాధించగా, ఖమ్మం జిల్లా 24 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ హాజరై విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. గౌరవ అతిథిగా తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.సారంగపాణి , విశిష్ట అతిథిగా ఖేలో ఇండియా క్యాంప్ అథ్లెటిక్స్ కోచ్ మహమ్మద్ గౌస్, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.ప్రభాకర్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు బాలమురళీ కృష్ణ, రమేష్, మోహన్, రాణి, తరంగిణి, రాము, రజనీకాంత్, మహేందర్, సురేష్, రాజేశ్వర్, వినయ్, హరీష్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

