అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క్రైమ్ ఏసీపీ డేవిరాజ్ వెల్లడించారు
- బైక్, రూ. 73వేలు స్వాధీనం.. వివరాలు వెల్లడించిన క్రైమ్ ఏసీపీ
సుబేదారి, జనవరి 11: అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క్రైమ్ ఏసీపీ డేవిరాజ్ వెల్లడించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రాము చెడు అలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించడానికి చోరీలకు పాల్పడేవాడు.
అతడు గతంలో బెల్లంపల్లిలో మోటర్ సైకిల్ చోరీ కేసులో జైలుకు వెళ్లాడు. వచ్చిన తర్వాత ఆసిఫాబాద్‌లో బైక్ చోరీ చేశాడు. డిసెంబర్లో వరంగల్ శివనగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి డబ్బులు, చోరీ చేశాడు. పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు నిందితుడిపై సీసీఎస్ పోలీసులు నిఘాపెట్టారు. వరంగల్ బూడిదగడ్డ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలో బైక్‌తో పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి బైక్, రూ.73వేల సొత్తు రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- arrest
- Asifabad
- CCS Police
- Subedari
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

