చలివాగులో చేపల వేట..!
ఇటీవలి వర్షాలకు కుంటలు, వాగుల్లో ఎక్కడచూసినా చేపలు పుష్కలంగా వచ్చి చేరాయి. వరదలకు కొన్ని ప్రాంతాల్లోనైతే పెద్ద పెద్ద చేపలు కూడా కొట్టుకు రావడం మనం చూశాం. మానుకోట జిల్లాలో అరుదైన క్యాట్‌ఫిష్, బంగారు వర్ణం మీనాలు కూడా మెరిశాయి.
- ఇటీవలి వర్షాలకు నిండుగా జల వనరులు
- ఇసురుడు గాలాలతో పడుతున్న జనం
- ఉపాధి పొందుతున్న మత్స్యకారులు, ప్రజలు
టేకుమట్ల, అక్టోబర్ 2 : ఇటీవలి వర్షాలకు కుంటలు, వాగుల్లో ఎక్కడచూసినా చేపలు పుష్కలంగా వచ్చి చేరాయి. వరదలకు కొన్ని ప్రాంతాల్లోనైతే పెద్ద పెద్ద చేపలు కూడా కొట్టుకు రావడం మనం చూశాం. మానుకోట జిల్లాలో అరుదైన క్యాట్‌ఫిష్, బంగారు వర్ణం మీనాలు కూడా మెరిశాయి. ఈ నేపథ్యంలో పెద్ద వాగుల వద్ద భారీగా జలపుష్పాలుండడంతో వాటిని పట్టేందుకు అందరూ ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో టేకుమట్ల మండలంలోని చలివాగులో వలలతో పాటు ఇసురుడు గాలాలు వేస్తూ వంద మందికి పైగా మత్స్యకారులు, ప్రజలు ఇటు కాలక్షేపంతో పాటు ఉపాధి పొందుతున్నారు.
ఈ ఇసురుడు గాలానికి చలివాగులో విసిరే గాలాలతో చేపల వేట సాగిస్తున్నారు. చలివాగులో వెలిశాల-గుమ్మడవెల్లి గ్రామాల మధ్య నిర్మించిన చెక్‌డ్యామ్‌తో వాటర్ స్టోరేజ్ కావడంతో పాటు టేకుమట్ల-రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య వంతెన ప్రాంతంలో వరదకు లోతైన కోత ఏర్పడి భారీగా నీరు నిలిచింది. ఇందులోకి చేపలు పెద్ద మొత్తంలో వచ్చిచేరాయి. దీంతో మత్స్యకారులతో పాటు మండల ప్రజలకు విసురుడు గాలాలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకుని వాటికి గోధుమపిండి, మైదాపిండి, తవుడు, కోడిగుడ్డు, బిస్కెట్లు, ఏదైనా కలర్ కలిపి మొత్తని ముద్దలా చేస్తారు.
గాలం వైరుకు చివరలో ఒక స్ప్రింగ్‌ని కట్టి దానికి కలిపిని పిండి మిశ్రమాన్ని కట్టి, ఈ పిండిలో గాలాలను పెట్టి స్ప్రింగ్ చుట్టూ కడుతారు. మరో పక్క గాలం వైరును ఒక బాటిల్‌కి గానీ చక్రాలకు గానీ చుట్టి, పిండి ముద్ద ఉన్న గాలాలను వాగులో దూరంగా విసురుతారు. దీంతో చేప వచ్చి ఆ పిండి మిశ్రమాన్ని తిని గాలానికి చిక్కుకోవడంతో ఒడ్డున ఉన్న బాటిల్, చక్రం ఉన్న వైరు నీటిలోకి వెళ్లడంతో వెంటనే గాలాన్ని లాగి చేపను పట్టుకుంటారు. ఈ విసురుడు గాలాలకు ఒక కిలో చేప మొదలు 10 కిలోల చేప వరకు పడుతుందని వారు చెబుతున్నారు. రోజు చలివాగు పరివాహక ప్రాంతంలో వంద మందికి పైగా ఇలా చేపలు పట్టి ఉపాధి పొందుతున్నారు.
రోజుకు 5 కిలోల నుంచి 25 కిలోల వరకు పడుతున్నాయంటున్నారు. వీటితో రోజుకు 500 నుంచి 3వేల వరకు వస్తాయని చెబుతున్నారు. చలివాగులో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చేపలను అధిక సంఖ్యలో పడుతూ ఉపాధి పొందుతున్నారు. కిలోల చొప్పున కాకుండా కొందరు చేపకు ఇంత ధర అమ్మేస్తున్నారు. వినియోగదారులకు కూడా చేపలు చౌకగా వస్తుండడంతో ఎక్కువగా కొనుగొలు చేస్తున్నారు.
కాలక్షేపంతో పాటు ఉపాధి
రోజూ ఉదయం బోళ్లు అమ్మడం కోసం ఊళ్లు తిరిగి వస్తాను. వచ్చేవరకు ఎవరూ ఉండరు. అందరూ వ్యవసాయ పనులకు వెళ్తారు. మధ్యాహ్నం సమయంలో నాలుగు విసురుడు గాలాల ను పట్టుకుని వాగుకి పోయి చేపలు పడు తా. దీని వల్ల నాకు కాలక్షేపం అవుతుంది. దొరికిన చేపలు ఇంట్లోకి వంటకు పనికొస్త య్. మిగిలినియి మా ప్రాంతంలోని చుట్టు పక్కల వారికి చౌకగా ఇస్తున్నా. ఆదాయం కూడా వస్తుంది. వాగు చుట్టూ(వాగు అవ తల, ఇవతల) చేపలు పట్టే అందరినీ చూస్తూ సంతోషంగా గడుపుతూ ఉపాధి పొందుతున్నం.
– తూర్పాటి చిన్న శంకర్, టేకుమట్ల
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

