పర్వతగిరి, నవంబర్ 20 : వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని డీఎంహెచ్వో వెం కటరమణ అన్నారు. శనివారం మండలంలోని వడ్లకొండలో ఇంటింటికి కొవిడ్ టీకాల కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. మండల ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసి 100 శాతం సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పర్వతగిరి పీహెచ్సీ తనిఖీ చేశారు. దవాఖానలోని వసతులను పరిశీలించారు. మండలంలో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు చేశా రు. కార్యక్రమంలో దవాఖాన మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ ముఖర్జీ, స్టాఫ్ నర్సు వనజ కుమారి, ఫార్మాసిస్టు సుజాత, జమాల్ పాల్గొన్నారు.