వైద్య విద్య పేదల దరికి
ఒంటిపై తెల్లటి అప్రోన్ (కోటు).. మెడలో స్టెతస్కోప్.. ‘డాక్టర్ సాబ్'.. ‘డాక్టరమ్మా’ అనే పిలుపు.. ఇది అరుదైన.. అపురూపమైన అనుభూతి. సామాన్యుడికి కలగనే స్థాయి కూడాలేని ఖరీదైన కోర్సు.. పేదలకు అందని పెద్ద చదువు.. డబ్బున్నోళ్లకు మాత్రమే అందివచ్చే చదువు అది.. ఒకవేళ తమ బిడ్డలను డాక్టర్ చేయాలని సంకల్పిస్తే లక్షలు పోసి ప్రైవేట్‌లో సీటు కొనడం..
- జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో సామాన్యుల కల సాకారం
- సొంత జిల్లాల్లోనే చదువు.. ఖర్చు లేకుండా డాక్టర్లయ్యే అరుదైన అవకాశం
- సీఎం కేసీఆర్‌కు వైద్య విద్యార్థుల కృతజ్ఞతలు
జనగామ, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఒంటిపై తెల్లటి అప్రోన్ (కోటు).. మెడలో స్టెతస్కోప్.. ‘డాక్టర్ సాబ్’.. ‘డాక్టరమ్మా’ అనే పిలుపు.. ఇది అరుదైన.. అపురూపమైన అనుభూతి. సామాన్యుడికి కలగనే స్థాయి కూడాలేని ఖరీదైన కోర్సు.. పేదలకు అందని పెద్ద చదువు.. డబ్బున్నోళ్లకు మాత్రమే అందివచ్చే చదువు అది.. ఒకవేళ తమ బిడ్డలను డాక్టర్ చేయాలని సంకల్పిస్తే లక్షలు పోసి ప్రైవేట్‌లో సీటు కొనడం..
లేదంటే బ్యాంకు రుణాలు తీసుకొని.. పోగేసిన పదోపరకో ఖర్చుచేసి ఎంబీబీఎస్ చదివించేందుకు విదేశాలకు పంపించాల్సిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో మన పిల్లలకు మనదగ్గరే పైసా ఖర్చు లేకుండా డాక్టర్లయ్యే సువర్ణావకాశం కలిగింది. గతంలో 850 సీట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారు ఏకంగా 4,490 సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 85శాతం స్థానికులకే కేటాయిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది.
ఒకప్పుడు పల్లేర్లు కూడా మొలవని.. గరకపోసకు సైతం దిక్కులేని ఎడారి లాంటి జనగామ ప్రాంతం, దేవాదుల నీటితో చెరువులు, కుంటలు నిండుకుండలా మారి ఇప్పుడు మరో కోనసీమను తలపిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రికార్డుస్థాయిలో ధాన్యం పండించే స్థాయికి ఎదిగింది. దీనికితోడు జనగామకు వైద్య విద్య కూడా చేరువై.. ఈప్రాంత ప్రజల ఏండ్ల నాటి కల సాకారమైంది.. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు సొంత జిల్లాల్లోనే ఖర్చు లేకుండా డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. ఉమ్మడి జిల్లా సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జనగామ కాలేజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తమ వైద్య విద్య కలను నేరుస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
థ్యాంక్స్ టూ కేసీఆర్
మా నాన్న పేరు బ్రహ్మానందం. ప్రైవేట్ జాబ్ చేస్తారు. అమ్మ లక్ష్మి హౌస్‌వైఫ్. మాది మధ్యతరగతి కుటుంబం. నన్ను డాక్టర్ చేయాలనేది వారి కోరిక. నీట్ రాసే ముందు దేశంలో ఎక్కడ సీటు వచ్చినా వెళ్దామని అనుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుందని.. నాకు పక్కనే ఉన్న జనగామలో సీటు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. తెలంగాణ రాకముందు వైద్యవిద్య అంటే అందని ద్రాక్షలా అనిపించేది.
కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి వాటిని ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాకు మెడికల్ సీటు రావడం సీఎం కేసీఆర్ సర్ తీసుకున్న నిర్ణయం వల్లనే సాధ్యమైంది. బాగా చదువుకొని మంచి డాక్టర్‌గా పేదలకు వైద్య సేవలు అందిస్తా. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– కేడిదేవి పద్మజ, హనుమకొండ
మా ఊరి పక్కనే కాలేజీ..
మాది పక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి. డాక్టర్ అయి పేదలకు వైద్య సేవ చేయాలనేది నా చిన్ననాటి కల. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించాలనే పట్టుదలతో గత ఏడాది నీట్ రాసా. ఫస్ట్‌టైం రాసినప్పుడు ర్యాంకు వచ్చినా సీటు రాలేదు. రెండోసారి రాసిన తర్వాత సీటు ఎక్కడ వస్తుందో.. ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోననే ఆందోళన ఉండేది. తెల్లకోటు వేసుకుంటానా? లేదా? అనే సందేహం కలిగేది.
డబ్బులు పెట్టి ఎంబీబీఎస్ చదివే స్థోమత మాకు లేదు. ఇక దేవుడే దిక్కు అని మొక్కుకున్న. ఆ దైవం కేసీఆర్ రూపంలో జిల్లాకో మెడికల్ కాలేజీ వరాన్ని ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు పక్కనే ఉన్న జనగామలో అతి సులభంగా అడ్మిషన్ వచ్చింది. దీనికి కారణం కేసీఆర్ సార్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే. ఇంత దగ్గరలోనే ఉంటూ డాక్టర్ అయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉన్నది. నా కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్.
– నీరడి స్వప్నిక, యాదాద్రి భువనగిరి జిల్లా
కేసీఆర్ సార్ వల్లే నా కల నెరవేరింది
మాది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. మధ్యతరగతి కుటుంబం. తెలంగాణ రాకముందు ఎంబీబీఎస్ చదవడం అంటే ఎంతో కష్టం. ఎందుకంటే నీట్ పరీక్ష రాసేవారు లక్షల్లో ఉంటే సీట్లు మాత్రం వందల్లోనే ఉండేవి. మంచి ర్యాంకు వచ్చినా మన రాష్ట్రంలో సీటు దొరికేది కాదు. విదేశాలకో ఇతర రాష్ర్టాలకో వెళ్లాల్సి వచ్చేది. కానీ సీఎం కేసీఆర్ సార్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సుమారు 10వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి..
పైగా రాష్ట్ర కోటా కింద 85శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నీట్ రాసిన వేలాది మంది విద్యార్థులకు గొప్ప వరం. పేదలు, సామాన్యులకు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది..మా ఊరికి దగ్గరలోని జనగామ మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది.. ఇంత అదృష్టాన్ని కల్పించిన సీఎం సార్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
– సామల హిమబిందు, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

