నిట్‌లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో ఆదివారం చివరి రోజూ అదే జోరు కొనసాగింది. మూడు రోజుల కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా విద్యార్థులు ఉత్సాహంగా పలు ఈవెంట్లను ప్రదర్శించారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్రదర్శనలు ప్రశంసలందుకున్నాయి. నటుడు నవదీప్‌తో విద్యార్థులు ఇంటరాక్టయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు హీరో హుషారుగా సమాధానం చెప్పారు. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి స్టూడెంట్స్‌తో తన అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులే నిర్వాహకులుగా జరుపుకున్న సాంస్కృతిక మహోత్సవం వారిలో నూతనోత్తేజాన్ని నింపింది.
– హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7
నిట్‌లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ఘనంగా ముగిశాయి. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా విద్యార్థులు పలు రకాల ఈవెంట్లను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. నుకడ్ నాటక్, డైరెక్టర్స్ కట్, కొరియో నైట్ వంటి ఈవెంట్లు పార్టిసిపెంట్ల నుంచి గొప్ప ప్రశంసలను పొందాయి. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసాచార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించిన అన్ని బృందాలు, వక్తలు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. స్ప్రింగ్ స్ప్రీ-24ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి వివిధ టీమ్‌లు అందించిన సహాయానికి కోఆర్డినేటర్లు, చందర్, సాహిత్, తనీష్, ప్రశాంత్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం సావెంజర్ హంట్, కరౌకే, వాట్స్ డిఫరెంట్, సోలో ఐడల్, ట్రెజర్ హంట్, మేళా తదితర ఈవెంట్లు ప్రదర్శించారు.
19 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలోకి వచ్చా. నిరంతరం ఎన్నో అడ్డంకులను ఎదురొన్నా. నేను రాసిన కథలు ప్రధానంగా ప్రేమ ఆధారంగా ఉంటాయి. ఫిల్మ్ మేకింగ్‌లో ప్రధాన సవాలు ఎడిటింగ్. సీతారామం షూటింగ్ సమయంలో 11 రోజుల పాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సార్లు మైనస్ ఉష్ణోగ్రత ప్రధాన సమస్య.
తాను ప్రపంచంలోని వివిధ ప్రదేశాలను సందర్శించడానికి, అన్వేషించడానికి ఇష్టపడతా. సావెంజర్, ట్రెజర్ హంట్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించా. విద్యార్థులు కూడా సాధ్యమైనంత వరకు ట్రావెల్ చేయాలి. కరోనా లాక్డౌన్ సమయంలో తాను నవదీప్ 2.0గా మారిపోయి తన జీవితం గురించి ఆలోచించా. నా జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటి బిగ్‌బాస్ ఇంట్లోకి వైల్డ్‌కార్డ్ ప్రవేశం. అకడ నా జీవితం, అవకాశాలు రూపాంతరం చెందాయి.