హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24: లాసెట్‌లో అర్హత సాధించి సీటు లభించని వారు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలని ఆదర్శ లా కళాశాల కరస్పాండెంట్ బూర విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతిభారాథోడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 7వ తేదీ వరకు నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ ఎల్ఎల్బీ మూడు సంవత్సరాలు, ఎల్ఎంఎల్ఎం కార్పొరేట్ లాస్, ఎల్ఎల్ఎం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో నేరుగా తమ ప్రాంతం నుంచి లాసెట్ కన్వీనర్ ఇచ్చే అడ్మిషన్ల లింకును అనుసరించి దరఖాస్తు చేసి అడ్మిషన్లు పొందొచ్చని వారు పేర్కొన్నారు. లాసెట్ రాయనివారు, లా సీటు లభ్యంకానివారు నేరుగా కాలేజీలో సంప్రదించి ఎల్ఎల్ఎం కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందాలన్నారు. మరిన్ని వివరాలకు 90009 71637 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు.