యువోత్సహం
ఎన్ఐటీ వరంగల్‌లో స్పింగ్స్ప్రీ వేడుకలు విద్యార్థుల్లో జోష్ నింపుతున్నాయి. రాసెంగాన్ కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా రెండో రోజు విద్యార్థులు అందరినీ ఆలోచింపజేసే ఈవెంట్లను ప్రదర్శించారు.
- నిట్‌లో స్ప్రింగ్‌స్ప్రీ జోష్
- ఆలోచింపజేసిన ఈవెంట్ల ప్రదర్శన
- అలరించిన సింగర్ నకాష్ అజిజ్
- ఫ్యాషన్ షో అదుర్స్
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 6 : ఎన్ఐటీ వరంగల్‌లో స్పింగ్స్ప్రీ వేడుకలు విద్యార్థుల్లో జోష్ నింపుతున్నాయి. రాసెంగాన్ కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా రెండో రోజు విద్యార్థులు అందరినీ ఆలోచింపజేసే ఈవెంట్లను ప్రదర్శించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో నిట్ క్యాంపస్ సందడిగా మారింది. విద్యార్థులు పోటీపడి మరీ ఈవెంట్లను ప్రదర్శించా రు. సరదా గేమ్స్.. మెదడుకు పదును పెట్టే ఈవెంట్లు.. ప్రో షోలు, ఫ్యాషన్ షోలు ఉత్సాహాన్ని నింపాయి. రాత్రి ప్రో షోలు నిర్వహించారు. ప్రసిద్ధ నేపథ్య గాయకుడు నకాష్ అజీజ్ పాటలతో అందరినీ అలరించారు. తర్వాత లోహార్- ది బ్లాక్‌స్మిత్ అనే ప్రముఖ బ్యాండ్ కూడా ప్రో షోలో పాల్గొని ప్రదర్శించారు. ఆదివారం నటుడు, నిర్మాత నవదీప్ పాల్గొననున్నారు. డైరెక్టర్స్ కట్ సందర్భంగా సీతారామం సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి పార్టిసిపెంట్స్‌తో ఇంటరాక్ట్ కానున్నారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డి.శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. సోలో ఐడల్, వాట్స్ డిఫరెంట్, హంగర్ గేమ్స్, ఫిల్మ్ హంట్, మాస్టర్ చెఫ్, హిస్పోల, కరోకే, వాక్ రసరంగం, ఫొటో ఫజిల్ వంటి ఈవెంట్లు నిర్వహించారు. కాగా, నిట్ అంబేద్కర్ లర్నింగ్ సెంటర్లో నిర్వహించిన టాక్ షోలో సినీ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పాల్గొని తన అనుభవాలను వివరించారు. అలాగే, గామీ చిత్ర దర్శకుడు విద్యాధర్ కూ డా తన గురించి వివరించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అలాగే, నిట్‌లో ఫ్యాషన్‌షో అదిరింది. విద్యార్థులు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ హొయలొలికించారు. స్ప్రింగ్స్ప్రీలో ఫ్యాషన్ షో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిట్ విద్యార్థులు విభిన్న డిజైన్ దుస్తులు ధరించి లేటెస్ట్ ైస్టెలిష్ క్యాస్టూమ్స్‌తో అదరగొట్టారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

