శరవేగంగా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ కార్యాలయ భవన సముదాయాల నిర్మాణాలను అతి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు
- 15 ఎకరాల స్థలం కేటాయింపు
- జీప్లస్-3 విధానంలో భవన సముదాయం
- ఇప్పటికే మూడంతస్తులకు పడిన స్లాబ్..
- జీప్లస్-2 వరకు చుట్టూ గోడల నిర్మాణాలు పూర్తి
మహబూబాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలం గాణ): జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ కార్యాలయ భవన సముదాయాల నిర్మాణాలను అతి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పనుల్లో మరింత వేగం పెంచారు. ప్రస్తుత ఎస్పీ కార్యా లయం సమీపంలోనే గతంలో 15 ఎకరాల విశాల స్థలం కేటాయించారు. ఇందులో ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని జీప్లస్ 3 విధానంలో సముదా యాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండు, మూడో అంతస్తులకు స్లాబ్‌లు ప డ్డాయి. ఇప్పటికే జీప్లస్ 2 వరకు చుట్టు గోడల నిర్మా ణాలు పూర్తయ్యాయి. ఇటీవల కాలం నుంచి ఎస్పీ కా ర్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంతో సాగు తున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి, కా ర్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. 2016 అక్టోబరు 11న మానుకోట జిల్లాగా అవతరించింది.
ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్ప టికే కలెక్టరేట్, మెడికల్ కళాశాల భవన సముదాయ ని ర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుత ఎస్పీ కార్యాలయం పక్కనే విశాల స్థలంలో ఎస్పీ భవన సముదాయం నిర్మి స్తున్నారు. విశాలమైన గదులతో కార్యాలయాన్ని అం దంగా నిర్మిస్తున్నారు. మొదటి, రెండవ అంతస్తులో భవన నిర్మాణ పనులను వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే వీటిలో అంతర్గత రహదారులు, చుట్టు ప్రహరీ, గ్రీనరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా వంద లాది మొక్కలు నాటి కార్యాలయాన్ని అందరంగా సుందరంగా తీర్చిదిద్దే విదంగా ప్రణాళిక తయారు చేశారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
జీప్లస్-3 విధానంలో నిర్మాణం
జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నిర్మాణం కోసం 15 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందులో జీప్లస్-3 విధానంలో భవన సముదాయాన్ని నిర్మిస్తు న్నారు. ఇందులో విశాలంగా ముందు పార్కింగ్ స్థ లంతో పాటు వెనుక వైపు పోలీస్ క్వార్టర్స్ నిర్మిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జీప్లస్-3 విధానంలో నిర్మిస్తున్న భవన సముదాయంలో అన్ని సెక్షన్లు, అన్ని విభాగాలు ఒకే భవనంలో ఉండే విధం గా నిర్మాణాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది కొత్త సంవ త్సరంలో నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నూతనంగా నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయం సమీ పంలోనే మెడికల్ కళాశాల ఉంది. నూతనంగా నిర్మి స్తున్న ఎస్పీ కార్యాలయం ముందు నుంచి మెడికల్ కళాశాల వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు కూడాఎలాంటి అంతరాయం ఏర్పడకుండా రోడ్డు వేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

