నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 28 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశ వర్కర్ల నిర్బంధకాండ కొనసాగిం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్ట్ చేశా రు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వారిని అదుపులోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మధ్యాహ్నం వరకు ఉంచుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆశ వర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డి మాండ్ చేస్తుంటే కాంగ్రెస్ సర్కారు ముందస్తు అరెస్ట్ చే యడాన్ని సీఐటీయూ నాయకులు ఖండించారు. మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై మం డిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.