హనుమకొండ చౌరస్తా, జూన్ 26: భూపాలపల్లికి చెందిన ప్రసిద్ధ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ నలిమెల అరుణ్‌కుమా ర్ తీసిన ఫొటోలు న్యూయార్క్ టైమ్స్ స్కేర్ లో ప్రదర్శించడంతో ఆయనకు అరుదైన గౌర వం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన డిజిటల్ డిస్ప్లే అయిన న్యూయార్స్ టై మ్స్ స్కేర్ బిల్బోర్డర్లపై అరుణ్‌కుమార్ తీసిన మూడు ఫొటోగ్రాఫ్స్ ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రదర్శన జూన్ 24, 25, 26 తేదీల్లో ఎన్ఎఫ్టీఎన్వైసీ 2025 కార్యక్రమంలో భాగంగా జరిగింది.
మిస్ ఇండియా 2023 విజేత, మిస్ వరల్డ్ 2025 లో భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా కాకతీయుల గొప్ప శిల్పకళకు ప్రతిరూపమైన రామ ప్ప దేవాలయాన్ని సందర్శించిన సమయం లో ఈ ఫొటో తీశాడు. రామప్ప ఆలయాన్ని తన ఫొటోగ్రఫీ ద్వారా ప్రపంచ ప్రసిద్ధ వేదికపై ప్రచారం చేయడం ఆనందంగా ఉందని, ఈ అంతర్జాతీయ గుర్తింపుతో తన బాధ్యత మరింత పెరిగిందని అరుణ్ కుమార్ పేర్కొన్నాడు. ఆయన తండ్రి భూపాలపల్లిలోని కేటీకే 8 ఇైంక్లెన్లో ఉద్యోగం చేస్తున్నారు. 2019 నుంచి పూర్తిస్థాయిలో అరుణ్‌కుమార్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ రెండు సార్లు ఇండియా మొత్తం చుట్టి వచ్చాడు.