బచ్చన్నపేట, సెప్టెంబర్ 5 : బచ్చన్నపేట పోలీస్ నుంచి కొడవటూరు కమాన్ వరకు పాడైన రోడ్డును మరమ్మతు చేయాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి కోరగా వెంటనే ఆయన సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఇందుకుగాను శుక్రవారం సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో గుంతల మయం అయిన చోట మరమ్మతు పనులు ప్రారంభించారు. గుంతల్లో సిమెంట్ కాంక్రీట్‌తో నింపి చదును చేస్తున్నారు. కాగా, తాత్కాలిక మరమ్మతు కాకుండా పోలీస్ స్టేషన్ నుంచి కొడవటూరు కమాన్ వరకు బీటీ రోడ్డు పక్కాగా నిర్మించాలని గ్రామ, మండల ప్రజలు కోరుతున్నారు.