Odarpu Yatra | సెప్టెంబర్ 17న వరంగల్లో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర
Odarpu Yatra | ఉద్యమకారులను ఐక్యం చేసే క్రమంలో సెప్టెంబర్ 17న ఉద్యమకారుల ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ వెల్లడించారు.
హనుమకొండ చౌరస్తా : ఉద్యమకారులను ఐక్యం చేసే క్రమంలో సెప్టెంబర్ 17న ఉద్యమకారుల ఓదార్పు యాత్ర ( Odarpu Yatra )ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్( Ravi kumar ) వెల్లడించారు. ఆ రోజున వరంగల్లోని తొలిదశ ఉద్యమకారుల జెండా నుంచి యాత్ర ప్రారంభం కానుందని, యాత్ర ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హనుమకొండ కాకతీయకాలనీలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తొలిదశ ఉద్యమకారుల విస్తృతస్థాయి సమావేశం తొలిదశ ఉద్యమకారుల రాష్ట్ర కన్వీనర్ టీఎన్.స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గుడిమళ్ల రవికుమార్ మాట్లాడుతూ 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నవారితో పాటు మలిదశ ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
, పెన్షన్, ఆరోగ్యకార్డు, ఫ్రీ బస్పాస్తో పాటు వారి సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఉద్యమ ఉద్దీపన పథకం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కన్వీనర్ దాసరి జనార్ధన్, హనుమకొండ కన్వీనర్ రామబ్రంహచారి, ఓదార్పుయాత్ర రాష్ట్ర ఇన్చార్జి నొడపెల్లి శ్యాంకృష్ణ, వరంగల్ జిల్లా ఇన్చార్జిలు చాంద్పాషా, బొల్లిశేటి అశోక్, చెన్నూరు నటరాజ, ఎర్ర మనోహర్, చుంచు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

