సుబేదారి/గిర్మాజీపేట, జూలై 5 : నగరంలో నైట్ పెట్రోలింగ్ మొదలైంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోకిరీలు, నేరస్తుల ఆటకట్టించేందుకు పోలీస్ బాస్ రంగంలోకి దిగారు. ఈమేరకు వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పోచమ్మమైదాన్, మండిబజార్, హనుమకొండ, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక నుంచి ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలుంటాయని ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు. ఆయన వెంట వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, ఎస్బీ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఉన్నారు.