సరికొత్తగా.. వీనుల విందుగా
కొన్నేళ్ల కింద మూతపడ్డ మ్యూజికల్ గార్డెన్ ఇక సరికొత్తగా.. నగరవాసులకు వీనులవిందు చేయనున్నది. ఇందుకోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.14.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోంది. వేగంగా పనులు జరుగుతుండగా, అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. పిల్లల ఆట వస్తువులతో పాటు గార్డెన్ అంతా ఫుట్‌పాత్‌లు.. వాటి వెంట లైటింగ్ అమర్చుతున్నారు.
- కొంగొత్త అందాలతో మ్యూజికల్ గార్డెన్
- రూ. 14.50 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
- మళ్లీ అలరించనున్న సంగీత ఝరి
- లేక్‌వ్యూ రెస్టారెంట్‌కు సన్నాహాలు
- గ్రీనరీతో ఆకట్టుకునేలా ముస్తాబు
వరంగల్, ఏప్రిల్ 21 : కొన్నేళ్ల కింద మూతపడ్డ మ్యూజికల్ గార్డెన్ ఇక సరికొత్తగా.. నగరవాసులకు వీనులవిందు చేయనున్నది. ఇందుకోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.14.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోంది. వేగంగా పనులు జరుగుతుండగా, అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. పిల్లల ఆట వస్తువులతో పాటు గార్డెన్ అంతా ఫుట్‌పాత్‌లు.. వాటి వెంట లైటింగ్ అమర్చుతున్నారు. మధ్య భాగాన కెఫటేరియా కోసం ప్రత్యేకంగా షెడ్‌ను నిర్మిస్తున్నారు. సందర్శకులకు వినసొంపైన సంగీతం అందించేందుకు ఫౌంటెయిన్ అందుబాటులోకి తేనున్నారు. మ్యూజికల్ గార్డెన్‌ను ఆనుకొని ఉన్న భద్రకాళీ చెరువు ఆందాలను వీక్షించేందుకు లేక్‌వ్యూ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చారిత్రక వరంగల్ టూరిజం హబ్‌గా మారుతున్న తరుణంలో నగర నడిబొడ్డున ఉన్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌ను సందర్శకులను ఆకట్టుకునేలా ముస్తాబు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా మూతపడి ఉన్న మ్యూజికల్ గార్డెన్‌ను కొత్త అందాలతో నగరవాసుల ముందుకు తీసుకువచ్చేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తోంది. రూ. 14.50 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. గార్డెన్లో గ్రీనరీ, ఫుట్‌పాత్‌లు, చిన్నారుల ఆట వస్తువుల ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. సందర్శకులకు మరింత ఆహ్లాదం అందించేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. మ్యూజికల్ గార్డెన్‌కు ఆనుకొని ఉన్న భద్రకాళీ చెరువు ఆందాలను కుటుంబంతో వీక్షిస్తూ హాయిగా గడిపేందుకు లేక్ వ్యూ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారు. అలాగే మ్యూజికల్ గార్డెన్‌కు వచ్చే సందర్శకులకు వీనుల విందైన సంగీతం అందించేందుకు ఫౌంటెయిన్ ఏర్పాటు చేయనున్నారు.

భద్రకాళీ చెరువు అందాలు వీక్షించేలా..
గార్డెన్‌ను ఆనుకొని ఉన్న భద్రకాళీ చెరువు అందాలను సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. ఇందుకోసం లేక్ వ్యూ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారు. లేక్ అందాలు వీక్షిస్తూ రెస్టారెంట్లో విందు ఆరగించేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్కిటెక్ట్‌లు వచ్చి రెస్టారెంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై సూచనలు చేసినట్లు తెలిసింది. దశాబ్దానికి పైగా మ్యూజికల్ గార్డెన్ పేరు నుంచి మ్యూజికల్ పోయింది. అందులో ఫౌంటెయిన్ పనిచేయకపోవడంతో అధికారులు దానిని తొలగించారు. ప్రస్తుతం మ్యూజికల్ గార్డెన్లో వీనులవిందైన సంగీతం వినిపించే ఫౌంటెయిన్తో పాటు దానిలోంచి మిరుమిట్లు గొలిపే లేజర్ లైటింగ్ వచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యాటకం నుంచి సంపద సృష్టించుకోవాలన్న ఆలోచనలతో కుడా అధికారులు మ్యూజికల్ గార్డెన్లో సరికొత్త హంగులు కల్పించి సందర్శకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

